Spread the love
మంద కృష్ణ మాదిగను మర్యాద పూర్వకంగా కలిసిన షర్మిల
YSR తెలంగాణ పార్టీ అధినాయకురాలు శ్రీమతి వైయస్ షర్మిల ఈరోజు విద్యానగర్ లోని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ మందకృష్ణ మాదిగ నివాసానికి వెళ్లి పరామర్శించారు. మందకృష్ణ మాదిగకి ఇటీవల ఢిల్లీలో శస్త్రచికిత్స జరగగా ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. మందకృష్ణ మాదిగ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం సెప్టెంబర్ 12వ తేదీన ఆదివారం నల్లగొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి పట్టణంలో YSR తెలంగాణ పార్టీ నిర్వహించబోయే “దళిత భేరి” బహిరంగ సభకు ఆహ్వానించారు. దళితుల పక్షాన మా యొక్క పోరాటానికి మద్దతుగా నిలవాలని మందకృష్ణ మాదిగని కోరారు.