షర్మిల కొత్త పార్టీ నిరుద్యోగ యువత కోసం తొలి అడుగులు

0
95
Spread the love

షర్మిల కొత్త పార్టీ నిరుద్యోగ యువత కోసం తొలి అడుగులు

హైదరాబాద్ జూలై 12 (ఎక్స్ ప్రెస్ న్యూస్ );తెలంగాణలో కొత్త పార్టీ పెట్టిన వైఎస్ షర్మిల తన తోలి కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. తెలంగాణలో నీళ్లు, నిధులతో పాటు నియామకాల లక్ష్యంగా ఏర్పడిన తెలంగాణా లో   నిరుద్యోగుల ఆశలు మాత్రం నెరవేరలేదు. నిరుద్యోగ యువత కోసం తన తొలి అడుగులు వేస్తోంది.తెలంగాణలోని నిరుద్యోగ యువతకు వెన్నుదన్నుగా నిలిచేందుకు ఇక నుంచి ప్రతి మంగళవారం నిరుద్యోగ దీక్ష చేపట్టనున్నట్లు వైఎస్ షర్మిల పార్టీ  ప్రకటించింది.ఉద్యోగం లేక నిరాశ నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్నయువతకు భరోసా కల్పించేందుకు ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈసంచలన నిర్ణయం తీసుకుంది. నిరుద్యోగ యువత కోసం ఏప్రిల్ 15 నుంచి 72 గంటల పాటు షర్మిల దీక్ష చేసినా ప్రభుత్వంలో స్పందన రాలేదన్నారు. ఈ క్రమంలోనే ఇక నుంచి నిరుద్యోగుల కోసం ప్రతివారం ఆందోళన చేయాలని నిర్ణయించుకున్నారు.కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే కురిపించే వరాలు మాని.. రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతతో ఉద్యోగ నోటిఫికేషన్ క్యాలెండర్ వేయాలని.. అప్పటివరకు తాను ప్రతి మంగళవారం నిరుద్యోగుల కోసం దీక్ష చేపట్టనున్నట్టు షర్మిల ప్రకటించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here