వైసీపీ ప్రభుత్వ అసమర్థ నాయకత్వం వల్ల ఏపీకి ఈ దుస్థితి

0
50
Spread the love

వైసీపీ ప్రభుత్వ అసమర్థ నాయకత్వం వల్ల ఏపీకి ఈ దుస్థితి

విజయవాడ జూలై 3 (ఎక్స్ ప్రెస్ న్యూస్): ప్రకాశం బ్యారేజీ నుంచి వృథాగా సముద్రంలోకి పోతున్న వరద నీటిని సాగు నీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య సభ్యులు శనివారం పరిశీలించారు. ఏపీకి ఇలాంటి విపత్కర పరిస్థితి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదని మాజీ అపెక్స్‌ కమిటీ సభ్యుడు వెంకట గోపాలకృష్ణారావు అన్నారు. వైసీపీ ప్రభుత్వ అసమర్థ నాయకత్వం వల్ల ఏపీకి ఈ దుస్థితి వచ్చిందన్నారు. తెలంగాణ ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం సరైన రీతిలో అడ్డుకోలేదని చెప్పారు.250 టీఎంసీలతో  తెలంగాణ ప్రాజెక్ట్‌లు కడితే ఏపీ పరిస్థితేంటి? అని వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తెలంగాణ అక్రమ ప్రాజెక్ట్‌లను సీఎం జగన్ అడ్డుకోవాలని గోపాలకృష్ణారావు అన్నారు. పాలమూరు, రంగారెడ్డిలాంటి అక్రమ ప్రాజెక్ట్‌లని.. తెలంగాణ కడితే వైసీపీ ప్రభుత్వం ఎందుకు అడ్డుకోలేదు? అని నిలదీశారు. 30 లక్షల ఆయకట్టు శ్రీశైలం దిగువన ఎండిపోయే పరిస్థితి వచ్చిందన్నారు. నారుమళ్లకి నీరు అడుగుతుంటే మేనేజ్‌మెంట్ ఏం చేయలేక నీటిని సముద్రంలోకి వదులుతుందన్నారు. వృథా నీటిని సముద్రంలోకి కాకుండా కాలువలకు మళ్లించాలని కోరారు. ఉమ్మడి ప్రాజెక్టుల్లో ఇష్టం వచ్చినట్లు విద్యుత్ ఉత్పత్తి  చేయరాదని తెలంగాణ ప్రభుత్వానికి సూచించారు. తెలంగాణ అక్రమ ప్రాజెక్ట్‌లు అడ్డుకోవాలని  సీఎం జగన్‌ని వెంకట గోపాలకృష్ణారావు డిమాండ్ చేశారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here