టీటీడీ చైర్మన్గా తిరిగి వైవీ సుబ్బారెడ్డి
అమరావతి జూలై 17 (ఎక్స్ ప్రెస్ న్యూస్ );: టీటీడీ చైర్మన్గా వైవీ సుబ్బారెడ్డినే తిరిగి కొనసాగనున్నారు.శుక్రవారం నాడు పలు కార్పొరేషన్లకు చైర్మన్లు, డైరెక్టర్లను జగన్ సర్కార్ ప్రకటించింది. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా ముఖంగా జాబితాను ప్రకటించారు. ఈ సందర్భంగా టీటీడీ విషయం గురించి ప్రస్తావించిన ఆయన.. సుబ్బారెడ్డినే మరో రెండున్నరేళ్ల పాటు కొనసాగిస్తున్నట్లు సజ్జల ప్రకటించారు. కాగా.. జోడు పదవులకు ఈసారి జగన్ సర్కార్ బ్రేక్ వేసింది. ఇవాళ ప్రకటించిన పదవుల్లో మహిళలకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది. మొత్తం 135 పోస్టుల్లో మహిళలకు 68, పురుషులకు 67 పోస్టులను ప్రభుత్వం కేటాయించింది. ఈ సందర్భంగా పలువురు మంత్రులు, వైసీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు వైవీకి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెప్పారు.